
లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
రేగొండ: మండలంలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి స్వాతి జన్మనక్షత్రం సందర్భంగా ప్రతీ నెల కోటంచ ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంత రం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనా ధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జోనల్ డ్యూటీ మీట్‌లో ప్రథమ స్థానం
భూపాలపల్లి అర్బన్: రామగుండం కమిషనరేట్ పరిధిలో జరిగిన జోనల్ డ్యూటీ మీట్‌లో భూపాలపల్లి పోలీస్ యంత్రాంగానికి చెందిన జాగిలం ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. జాగిలం బ్రేవో, హెండిలర్ రమేష్ పేలుడు పదార్థాలను గుర్తించే విభాగంలో జోన్–1లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఉత్తమ పదర్శన పట్ల ఆర్‌ఐ ఆపరేషన్స్ కిరణ్ అభినందించారు.
నల్ల చట్టాలను రద్దుచేయాలి
భూపాలపల్లి అర్బన్: కార్మికులకు నష్టాన్ని కలిగించే నాలుగు నల్ల చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు విజేందర్, జోగబుచ్చయ్య, కంపేటి రాజయ్య, బడితల సమ్మయ్య డిమాండ్ చేశారు. శనివారం ఏరియాలోని కేటీకే ఓసీ–3 ప్రాజెక్ట్‌లో గేట్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మిక హక్కులను కాల రాసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరణ చేసి నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయబోతుందని వాపోయారు. ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌లలో పని చేస్తున్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చంద్రమౌళి, శంకర్ పాల్గొన్నారు.
మద్దులపల్లికి ఆర్టీసీ బస్సు
కాళేశ్వరం: కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సుకు నోచుకోని మద్దులపల్లి గ్రామానికి ఎట్టకేలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో ఆర్టీసీ సేవలు ప్రారంభించింది. ఇటీవల మంత్రికి ఆ గ్రామస్తులు విన్నవించుకోగా.. బస్సు నడిపించాలని మంథని డిపో మేనేజర్ శ్రావణ్‌ను మంత్రి ఆదేశించారు. దీంతో గ్రామస్తులు మంథని డిపోకు వెళ్లి ఆర్టీసీ డిప్యూటీ మేనేజర్ ఏంజల్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో శుక్రవారం నుంచి కాటారం మండలం గంగారం, దామెరకుంట, అన్నారం, చండ్రుపల్లి మీదుగా మద్దుపల్లి గుండా కాళేశ్వరం వెళ్తుంది. దీంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులు నడిపిస్తుండడంతో గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
నిరుద్యోగుల అరెస్ట్ సిగ్గుచేటు
చిట్యాల: డీవైఎఫ్‌ఐ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా సచివాలయాన్ని ముట్టడిస్తే అరెస్ట్ చేయడం సిగ్గుచేటని డీవైఎఫ్‌వై జిల్లా అధ్యక్షుడు భూక్యా నవీన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాక ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా వైఫలమైందని విమర్శించారు. అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రకటించి ఇంత వరకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రానున్న రోజులలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు.

లక్ష్మీనరసింహస్వామి కల్యాణం