
పాఠశాలలను పర్యవేక్షణ చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో శనివారం జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ అధ్యక్షతన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ హాజరై బడిబాట కార్యక్రమంలో నమోదైన విద్యార్థుల సంఖ్య, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ యాప్ అత్యధికంగా నమోదు చేసిన సూరారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను అభినందించారు. మిగతా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అందరూ ఎక్కువ శాతం ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు అయ్యేలా చూడవలసిందిగా సూచించారు. ప్రతిరోజు విధిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు వారి పాఠశాలలలో ప్రార్థన సమయానికి హాజరై పర్యవేక్షించాలని ఆదేశించారు.