
పర్యావరణ పరిరక్షణకు కృషి
● ఏరియా సింగరేణి జీఎం
రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: ప్లాస్టిక్ నియంత్రించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు కృషిచేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా మారిందన్నారు. మహాసముద్రాలు, వన్యప్రాణులు, జీవ జలాలతో పాటు మానవ ఆరోగ్యానికి ప్రమాదంగా తయారైనట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగ ప్రత్యామ్నాయాలను స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు కవీంద్ర, జోతి, సురేఖ, మారుతి, పోషమల్లు, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, రెస్క్యూ ఇన్‌చార్జ్ పూర్ణచందర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
క్రషర్, బంకర్ ప్రారంభం
గణపురం: సింగరేణిలో అధునాతన యంత్రాలను వినియోగించుకొని అధిక ఉత్పత్తి సాధించవచ్చని భూపాలపల్లి జీఎం రాజేశ్వరెడ్డి అన్నారు. గణపురం మండలం పరుశరాంపల్లి ఓసీ–3 ప్రాజెక్టులో సోమవారం క్రషర్, బంకర్‌లకు ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటుజీఎం కవిందర్, ప్రాజెక్టు అధికారి భిక్షమయ్య, మేనేజర్లు శ్రీనివాస్, మధుసూదన్ పాల్గొన్నారు.