స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలి

Jul 1 2025 4:19 AM | Updated on Jul 1 2025 4:19 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలి

భూపాలపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జీ)లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై గ్రామాల స్వచ్ఛతలో ముందుండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ 2025 కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ‘ఒక అడుగు స్వచ్ఛత వైపు’ అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల పరిస్థితులపై అభిప్రాయాలను తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, డీఆర్‌డీఓ బాలకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

క్యాబిన్‌ ఏర్పాటు చేయాలి..

చెల్పూరు మిల్లెట్స్‌ విక్రయ నిర్వహణకు ఐడీఓసీ కార్యాలయంలో క్యాబిన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ డీఆర్‌డీఓకు సూచించారు. మిల్లెట్‌ యూనిట్‌ నిర్వహిస్తున్న మహిళలతో కలెక్టర్‌ ఐడీఓసీ కార్యాలయంలో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నేటి ప్రజల దైనందిన జీవనశైలిలో మిల్లెట్స్‌ వినియోగం ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలకృష్ణ, చెల్పూరు మిల్లెట్‌ యూనిట్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

శేష జీవితం ప్రశాంతంగా గడపాలి..

37 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో ఖాజా మోహినుద్దీన్‌ నిర్విరామ సేవలు అందించారని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అభినందించారు. కలెక్టరేట్‌ పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌ ఖాజా మోహినుద్దీన్‌ ఆత్మీయ అభినందన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఎస్డీసీ వైవీ రమేష్‌, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

వినతులు పరిష్కరించాలి..

ప్రజావాణిలో వచ్చిన వినతుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 57మంది నుంచి వినతులను కలెక్టర్‌ రాహుల్‌ శర్మ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆర్డీఓ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

భూపాలపల్లి రూరల్‌: సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌ కరపత్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రవి పాల్గొన్నారు.

మిల్లెట్స్‌ విక్రయానికి

కలెక్టరేట్‌లో ప్రత్యేక క్యాబిన్‌

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement