
దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని అర్హత కలిగిన దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు రెట్రో ఫిట్మెంట్ స్కూటీలు –25, బ్యాటరీ వీల్ చైర్లు 8, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు 10, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1, హైబ్రిడ్ వీల్‌చైర్లు 3, ల్యాప్ టాప్ 1, చేతికర్రలు 13, వీల్ చైర్లు 3, చెవిటి యంత్రం 1, ట్రై సైకిళ్లు 3, స్మార్ట్ కేన్స్ 6 కేటాయించారన్నారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్‌నంబర్ 155326 లేదా 96523 11804లో సంప్రదించాలని సూచించారు.
గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం అందజేస్తున్న సేఫ్టీ మోకులను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ అన్నారు. భూపాలపల్లి మండలం కొత్తపల్లి (ఎస్‌ఎం) శివారు సోలిపేట తాటివనంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ మోకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌గౌడ్ వివిధ గ్రామాలకు చెందిన 150మంది గీత కార్మికులకు సేఫ్టీమోకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు సేఫ్టీ మోకులు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతి కిరణ్, ఎకై ్సజ్ శాఖ ఎస్సై రబ్బాని, ఎస్‌ఎం కొత్తపల్లి గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు ఆరెల్లి రఘుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చౌకబారు విమర్శలు
మానుకోవాలి
మల్హర్: మంత్రి శ్రీధర్‌బాబుపై పుట్ట మధు చేస్తున్న చౌకబారు విమర్శలను మానుకోవాలని ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్డీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడిచర్లలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్‌బాబు విద్యావంతుడైన, విజన్ ఉన్న నాయకుడని పేర్కొన్నారు. నియోజకవర్గానికి మంత్రి చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే మధు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్‌బాబుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్డీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, మాజీ ఎంపీపీ చింతలపల్లి మల్హల్‌రావు, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్క సూర్యప్రకాశ్‌రావు పాల్గొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు