
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీల (ఎన్‌ఎస్‌పీసీ)వాల్‌పోస్టర్‌ను శనివారం జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి విద్యార్థులు అలవర్చుకోవాలని డీఈఓ రాజేందర్ తెలిపారు. హరిత్, ద వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో పర్యావరణ సంరక్షణ అనే ఉద్దేశంగా దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లోనే పోటీలు నిర్వహించి ఆగస్టు 30వ తేదీన ఫలితాలు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈకో మిత్ర మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్వామి, లక్ష్మన్, రమేష్, రాజగోపాల్, రామకృష్ణ, ఎంఈఓలు పాల్గొన్నారు.
లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: సివిల్ సర్వీస్‌లో లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి అధికారి క్రాంతికిరణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న వారికి హైదరాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు జూలై 8వతేదీ వరకు అన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0870–2571192 లేదా 77803 59322 నంబర్లను సంప్రదించాలని సూచించారు.