
అక్రమ అరెస్ట్ అమానుషం
కాటారం: గ్రామపంచాయతీ కారోబార్లు, వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషమని తెలంగాణ ఎంప్లయీస్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ దోమల శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు కారోబార్లు, సిబ్బంది వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండలంలోని పలువురు కారోబార్లు, సిబ్బందిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ యూనియన్ నుంచి ముట్టడికి పిలుపునివ్వలేదని మరో యూనియన్ తలపెట్టిన ధర్నాకు తమకు సంబంధం లేదన్నారు. పోలీసులకు వివరించినప్పటికీ వినిపించుకోలేదని రాత్రి నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచారని ఆరోపించారు. పోలీసులు వివరాలు తెలుసుకోకుండా అక్రమ నిర్బంధం చేయడం బాధాకరమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మెండ మల్లికార్జున్‌రావు, చిట్యాల శశికుమార్, బొర్లకుంట రవి, ఆత్కూరి రవి, కొండయ్య ఉన్నారు.