
‘మత్తు’ నివారణలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
భూపాలపల్లి అర్బన్: మత్తు పదార్థాల నివారణలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్‌బాబు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీని కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను నిశితంగా గమనించాలన్నారు. డ్రగ్స్ భూతాన్ని తరిమేయడంలో సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, పోలీసు శాఖను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ను తరిమేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. మత్తుపదార్థాల నిర్మూలన కోసం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్, అడిషన ల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ నరేశ్‌కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, వివిధ శా ఖల అధికారులు మల్లీశ్వరి, శ్రీనివాస్, రాజేందర్, పోలీసులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సీహెచ్ రమేశ్‌బాబు