
విద్యార్థులకు టీషర్టుల పంపిణీ
చిట్యాల: మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి మెరుగు రాజ్‌కుమార్ యాదవ్ తన సొంత డబ్బులతో 20 మంది విద్యార్థులకు టీషర్టులను మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్, మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కోరారు. ప్రభుత్వం పాఠశాలలోనే మెరుగైన వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చాడ అనంద్‌రెడ్డి, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ దొంతి రాంరెడ్డి, చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మేదరి సునీల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయులు రాధికారాణి, ఉమాదేవి, స్వరూప, రూపశ్రీ, ఎండి.రఫీ, గ్రామస్తులు రేగూరి కుమార్‌రెడ్డి, శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.