
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈకార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వర్‌రావుతో కలిసి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశ ప్రగతికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కారణంగానే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛా, సమానత్వం, సమాన అవకాశాలు లభించాయన్నారు. కార్యక్రమంలో అధికారులు అసోసియేషన్ నాయకులు కవీంద్ర, జ్యోతి, ఎర్రన్న, సురేఖ, మారుతి, రజిని, ప్రదీప్, బాలరాజు, చంద్రశేఖర్‌రావు, ఎంవీ రావు, వెంకటేశ్వర్లు, రాయమల్లు, చక్రపాణి, రమేశ్, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.