భూపాలపల్లి అర్బన్: 2024–25 ఆర్థిక సంవత్సరం సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు 40శాతం ఇవ్వాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యం గత లాభాలను నేటికీ ప్రకటించలేదన్నారు. లాభాలు ప్రకటించి కార్మికులకు అందించాలని కోరారు. సమావేశంలో జనార్ధన్, ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్, జయశంకర్, సాజిత్ పాల్గొన్నారు.
నియామకం
భూపాలపల్లి అర్బన్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్‌గా పట్టణా నికి చెందిన గుజ్జల ప్రేమ్‌కుమార్ నియమితులయ్యారు. ఆర్మూర్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జాన్‌రెడ్డి.. ప్రేమ్‌కుమార్‌ను కన్వీనర్‌గా నియమించారు.
ముగిసిన క్రీడాపాఠశాల ఎంపికలు
భూపాలపల్లి అర్బన్: క్రీడాపాఠశాల జిల్లాస్థాయి ఎంపికలు బుధవారం ముగిసినట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రఘు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు అన్ని మండలాల విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. 11 మండలాల నుంచి 80 మంది విద్యార్థులు పాల్గొనగా జిల్లా స్థాయికి 20 మంది బాలబాలికలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జూలై 1వ తేదీన హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని డీవైఎస్‌ఓ తెలిపారు.
డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన
మొగుళ్లపల్లి: మండలంలోని ముల్కలపల్లి, వేములపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజీంగ్ పీడీ లోకిలాల్, పంచాయతీరాజ్ డీఈ రవికుమార్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు
టేకుమట్ల: గ్రామాల్లో గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠినచర్యలు తప్పవని వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంతోపాటు, అంకుషాపూర్, సోమనపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి నుంచి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 450 లీటర్ల చక్కెర పానకాన్ని పారబోశారు. ఇద్దరిని అరెస్టు చేసి, నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ గుడుంబా వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, కావున గుడుంబాను సేవించరాదన్నారు. అలాగే గుడుంబాను గ్రామాల్లో ఎవరైనా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో భూపాలపల్లి ఎస్‌హెచ్‌ఓ రమ్య, డీటీఎఫ్ సీఐ రాజసమ్మయ్య, భూపాలపల్లి ఎస్సై రబ్బాని, తదితరులు ఉన్నారు.

వార్షిక లాభాల్లో 40శాతం వాటా ఇవ్వాలి

గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు

వార్షిక లాభాల్లో 40శాతం వాటా ఇవ్వాలి

వార్షిక లాభాల్లో 40శాతం వాటా ఇవ్వాలి