
కేటీకే 1వ గనిలో సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. కేటీకే 1వ గనిలో ఫిట్ సెక్రటరీ సదయ్య ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన గేట్ మీటింగ్‌కు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాన్‌రైడింగ్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల కాప్‌లైట్స్, ఎక్స్‌ప్లోడర్స్, ఫిల్టర్ బెడ్ రిపేర్, తాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. బైక్ పార్కింగ్ షెడ్స్‌లలో సిమెంట్ రేకులు తొలగించి ఐరన్ రేకులు ఏర్పాటు చేయాలన్నారు. 3సీమ్‌లో ఖాళీ టబ్బులు సరిపడా పెంచాలని, మాన్‌వేలో వర్షం వల్ల స్లాపు పగుళ్లు ఏర్పడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రిపేర్ చేయాలని కోరారు. కేటీకే ఓసీ 2 నుంచి కేటీకే 1వ గని వరకు వీధి దీపాలు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సమస్యలపై గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదయ్య, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.