
ఘనంగా ఒలింపిక్ డే
ఒలింపిక్ రన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి అర్బన్: ఒలింపిక్ డేను పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో రన్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఒలింపిక్ టార్చ్‌తో రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, డీపీఓ వీరభద్రయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికిరణ్, సీఐ నరేష్, ఎస్‌ఐ సాంబమూర్తి, క్రీడాసంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.