
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
కాటారం: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా సంక్షేమాధికారిణి మల్లీశ్వరి అన్నారు. నాశముక్తి భారత్ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో సామూహికంగా మొక్కలు నాటారు. నాశముక్తి భారత్ లక్ష్యాలపై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మల్ల్లీశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు మత్తుపదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ప్రతీఒక్కరు ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, కేజీబీవీ ప్రిన్సిపల్ చల్ల సునీత పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమాధికారిణి మల్ల్లీశ్వరి