
హామీలను అమలుచేయాలి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ.6లక్షల నిధులు కేటాయించాలని దళితులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి రాజారత్నం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్‌లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పొనగంటి లావణ్య అధ్యక్షతన మూడవ జిల్లా మహాసభకు రాజారత్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని కోరారు. అంబేడ్కర్ యోజన పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్, పసరగొండ మహేందర్, బౌతు కమలాకర్, దొంతుల రవీందర్, రాజమౌళి, గుర్రం సంపత్, రమేష్ రాజేష్, చిట్యాల పద్మ, బానమ్మ పాల్గొన్నారు.
డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రాజారత్నం