
ప్రతీ రైతుకు ‘భరోసా’
భూపాలపల్లి రూరల్: పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 రైతు భరోసా నిధుల పంపిణీ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులకు గాను రూ.143,99,06,145 నిధులను రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 1,09,034 మంది రైతులకు రూ.114.43 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ