భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సు

Jun 21 2025 3:05 AM | Updated on Jun 21 2025 3:05 AM

భూ సమ

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సు

టేకుమట్ల/మొగుళ్లపల్లి: భూ సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలం సోమనపల్లి, మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేయని వారు ఈ నెల 23న తహసీల్దార్‌ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. పిడిసిల్ల గ్రామంలోని రేషన్‌షాపుపై పలు ఆరోపణలు రావడంతో డీఎస్‌ఓ శ్రీనాథ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్లు విజయలక్ష్మి, సునీత, గిర్దావర్‌ శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సు1
1/1

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement