
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
కాటారం: ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం సభ్యులు సూచించారు. మహాముత్తారం మండలం కొర్లకుంటలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను శుక్రవారం బృందం సభ్యులు పరిశీలించారు. ఆరోగ్య మందిర్ ద్వారా అందుతున్న వైద్య సేవలు, మందులు, సౌకర్యాలు, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. వైద్యసేవలను విస్తృత పర్చడంతో పాటు రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ సునిత పలివల్, డాక్టర్ గంగతరన్, జిల్లా ప్రోగ్రామింగ్ అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, వైద్యులు డాక్టర్ సందీప్, డీపీఓ చిరంజీవి, ఇన్‌చార్జ్ జిల్లా క్వాలిటీ మేనేజర్ శరత్, డీడీఎం మధుబాబు, వైద్యులు రాజకుమారి జ్యోతి, మమత ఉన్నారు.