
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
చిట్యాల: పై ఫొటోలో కనిపిస్తున్నది చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేకపోవడంతో రెండో తరగతి విద్యార్థులను వరండాలోనే కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో 65మంది విద్యార్థులు, ఆరు తరగతులకు నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మూత్రశాలల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుంది. మూడేళ్ల క్రితం అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. నేటికీ పూర్తి చేయలేదు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తాగునీటిని ఇంటి నుంచి తీసుకువస్తున్నారు.

వాతావరణం