
ముందస్తు సాగుకు సిద్ధం కావాలి
గణపురం: గణపసముద్రం చెరువు ఆయకట్టు రైతులు ముందస్తు సాగుకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం గణపసముద్రం చెరువు కోట కాల్వ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపసముద్రం చెరువులో పంట సాగుకు నెల రోజులకు సరిపడా నీరు ఉందని ఆలోపు వర్షాలు పడుతాయన్నారు. లేదంటే రామప్ప చెరువు నుంచి గణపసముద్రంకు నీటిని విడుదల చేసి నింపుతామన్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే నార్లు పోసి సాగుకు సిద్ధమయ్యారన్నారు. గణపసముద్రం ఆయకట్టు రైతులు ఎప్పుడు నెలరోజులు ఆలస్యంగా పంట సాగు చేస్తున్నారని, దీంతో వాతావరణం సహకరించక నష్ట పోవడం జరుగుతుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పంట సాగుకు సిద్ధం కావాలన్నారు. పంట పొలాలకు నీరు సాఫీగా వెళ్లేందుకు కాల్వలో సిల్డ్ తీయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఐబీ ఈఈ బస్వప్రసాద్, ఏఈ సమ్మారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
గణపసముద్రం ఆయకట్టుకు
సాగు నీరు విడుదల