
రేపు డిప్యూటీ సీఎం భట్టి రాక
భూపాలపల్లి రూరల్: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈనెల 17న మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం భూపాలపల్లి మంజూరునగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తపల్లిగోరి, భూపాలపల్లి, గణపురం, చిట్యాల మండలాల్లో పలు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మంజూర్‌నగర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని జెన్కోలో సింగరేణి, జెన్కో అధికారులతో వేర్వేరుగా నిర్వహించే సమీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. మోరంచపల్లి నుంచి మంజూరునగర్ సభావేదిక వరకు నిర్వహించనున్న ద్విచక్ర వాహన ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
సభాస్థలి పరిశీలన..
మంజూరునగర్‌లోని సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి, జెన్కో, పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు సుంకరి రామచంద్రయ్య, దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్, శిరుప అనిల్, అప్పం కిషన్, మహేందర్ ఉన్నారు.
పర్యటనను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు