నిర్విరామంగా వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

నిర్విరామంగా వైద్యసేవలు

May 26 2025 1:11 AM | Updated on May 26 2025 1:11 AM

నిర్వ

నిర్విరామంగా వైద్యసేవలు

భూపాలపల్లి అర్బన్‌: సరస్వతీ నది పుష్కరాల నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో విస్తృతంగా వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్‌ ఆధ్వర్యంలో 10 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 40మంది వైద్యులు, 450మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని పీహెచ్‌సీకి తీవ్రతను బట్టి మహదేవపూర్‌ సీహెచ్‌సీ, భూపాలపల్లి జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆదివారం వరకు సుమారు 12వేల మంది భక్తులకు వైద్యసేవలు అందించారు.

మొదటిసారి పుష్కర విధులు..

ఇన్ని రోజుల పాటు జాతరలో భక్తులకు సేవలు అందించడం మొదటిసారి. పీహెచ్‌సీలో ఏర్పాటుచేసిన మొయిన్‌ క్యాంపులో విధులు నిర్వర్తించి భక్తులకు సేవలందించాం. భవిష్యత్‌లో ఇటువంటి క్యాంపులకు వెళ్లేందుకు దైర్యం వచ్చింది.

– డాక్టర్‌ కె.హారిక, వైద్యురాలు

మెరుగైన సేవలు అందించాం..

సరస్వతీ పుష్కరాల సందర్భంగా పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన మొయిన్‌ క్యాంపులో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. క్యాంపు ద్వారా మరింతం అనుభవం వచ్చింది. ఇప్పుడు ఎదురైన లోటు పాట్లు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో వాటిని సరిదిద్దుకుంటాం.

– డాక్టర్‌ సుస్మిత, వైద్యాధికారిణి

గత అనుభవంతో..

గతంలో కాళేశ్వరంలో జరిగిన పుష్కర, మేడారం జాతర విధుల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు కావాల్సిన మెడిసిన్‌ను సిద్ధంగా ఉంచుకున్నాం. మొబైల్‌ అంబులెన్స్‌ల ద్వారా వైద్య శిబిరాలకు ఎప్పటికప్పుడు పంపించాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాం.

– సదయ్య, ఫార్మసీ అధికారి

సంతోషంగా ఉంది..

పుష్కరాల్లో విధులు నిర్వర్తించడం సంతోషకరంగా ఉంది. వేలాది మందికి వైద్యసేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నా. మేడారం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పనిచేశాం. 7 అంబులెన్స్‌(108)ల ద్వారా 600 నుంచి 700 మందికి సేవలు అందించాం. మొబైల్‌ అంబులెన్స్‌ల ద్వారా 10వేలకు పైగా భక్తులకు సేవలందించాం.

– మేరుగు నరేష్‌, 108 జిల్లా కోఆర్డినేటర్‌

సరస్వతీ పుష్కరాల పరిసరాల్లో

మెడికల్‌ క్యాంపులు

పీహెచ్‌సీలో తాత్కాలికంగా

20 పడకలు ఏర్పాటు

నిర్విరామంగా వైద్యసేవలు1
1/4

నిర్విరామంగా వైద్యసేవలు

నిర్విరామంగా వైద్యసేవలు2
2/4

నిర్విరామంగా వైద్యసేవలు

నిర్విరామంగా వైద్యసేవలు3
3/4

నిర్విరామంగా వైద్యసేవలు

నిర్విరామంగా వైద్యసేవలు4
4/4

నిర్విరామంగా వైద్యసేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement