
సుందరయ్య జీవితం ఆదర్శం
భూపాలపల్లి రూరల్: పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రమేశ్ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్థంతిని జిల్లా కమిటీ సభ్యుడు ఆకుదారి రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు సుందరయ్య అని అన్నారు. గ్రామాన్ని అర్థం చేసుకోవడం అంటే దేశాన్ని అర్థం చేసుకోవడం అనే వారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజన్న, వంగల విజయలక్ష్మి, గడప శేఖర్, నాయకులు రవికుమార్, మేకల మహేందర్, మహేష్, శంకర్, సమ్మక్క, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు
అరటి తోట దగ్ధం
చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన క్యాతం వెంకటరమణకు చెందిన అరటితోట ప్రమాదవశాత్తు సోమవారం దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన క్యాతం వెంకటరమణ మూడు ఎకరాల్లో అరటి తోట సాగు చేస్తున్నాడు. దీంతో పక్క చేను రైతులు వ్వవసాయ పొలంలో ఉన్న వ్యర్థాలను దగ్ధం చేస్తుంటే మంటలు వ్యాపించి అరటి తోటతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా అప్పటికే ఎకరానికి పైగా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. సుమారు రూ.3లక్షల వరకు పంట నష్టం అయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.
కాటారం డీఎస్పీ బదిలీ
కాటారం: కాటారం సబ్ డివిజన్ డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ సాధారణ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కాటారం డీఎస్పీగా పని చేస్తున్న రామ్మోహన్‌రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ భూపాలపల్లి జిల్లా డీసీఆర్‌బీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న బి.నారాయణను కాటారం నూతన డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పౌష్టికాహారం అందజేత
చిట్యాల: పిల్లలకు, గర్భిణులకు సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు, గర్భిణులకు బాలామృతం, పల్లిపట్టీలు, కురుకురేలు డీడబ్ల్యూఓ మల్లేశ్వరి చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. గర్భిణుల కు, చిన్నారులకు, బాలింతలకు న్యూట్రీషన్ ఫుడ్ ఎంతో మేలన్నారు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అలాగే పుష్కరాలకు వచ్చిన వారు ఎవరైన తప్పితే మా దృష్టికి తీసువస్తే మైక్‌లో అనౌన్స్ చేసి తప్పిపోయిన వారిని మీ దగ్గరకు చేర్చడంతో సహాయం చేస్తామన్నారు. సూపర్‌వైజర్ సంధ్య, సిబ్బంది మమత పాల్గొనారు.
ఐరన్ పోల్స్ ఏర్పాటు
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయ పరిధిలో గల శివాలయానికి సోమవా రం పురావస్తు శాఖ అధికారులు ఐరన్ పోల్స్ ఏర్పాటు చేశారు. శివగుడిగా పిలవబడే ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకొని కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ముందస్తు చర్యలో భాగంగా ఆలయం చుట్టూ ఐరన్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేసినట్లు పురావస్తుశాఖ జిల్లా అధికారి నవీన్‌కుమార్ తెలిపారు.

సుందరయ్య జీవితం ఆదర్శం

సుందరయ్య జీవితం ఆదర్శం