
రాజ్యాంగ పరిరక్షణకు కృషి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా, మండల నాయకులు సంపత్‌రావు, మేకల భిక్షపతి, పట్టెం శంకర్, బొజ్ఙం రవి, గండ్ర రమణారెడ్డి, షాబీర్, భలేరావు మనోహర్‌రావు, వీరబ్రహ్మం, కోగిల క్రాంతి, ఎడ్ల మల్లారెడ్డి, ముద్దమల్ల రవి పాల్గొన్నారు.
పరామర్శ..
రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో బండి అశోక్‌కు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు ఆదివారం దగ్ధమైంది. దీంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్‌రావు, నడిపల్లి శ్రీనివాసరావు, శ్రీధర్, రజినీకాంత్ ఉన్నారు.