ఆన్‌లైన్‌లోనే తరగతులు.. | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లోనే తరగతులు..

Mar 19 2025 1:20 AM | Updated on Mar 19 2025 1:17 AM

నర్సింగ్‌ కళాశాలకు భవనం కరువు

భవన నిర్మాణానికి రూ.26కోట్ల నిధులు

నర్సింగ్‌ కళాశాల, హాస్టల్‌ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం గతేడాది రూ.26కోట్ల నిధులను కేటాయించింది. రెవెన్యూ శాఖ అధికారులు భూమిని కేటాయిస్తే టెండర్లు పూర్తిచేసి భవన నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్థల సేకరణపై శ్రద్ధ చూపనట్లు కనిపిస్తుంది. కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి భవన నిర్మాణం చేపట్టాలని.. అప్పటివరకు తాత్కాలిక భవనం కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన నర్సింగ్‌ విద్య అంతంత మాత్రమే నడుస్తుంది. కళాశాలకు భవన సౌకర్యం లేకపోవడంతో గత డిసెంబర్‌లో వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభమైన నర్సింగ్‌ కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు. వసతి, తరగతులకు భవనం లేకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులతో నెట్టుకొస్తున్నారు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల సమీపంలో ఆయూష్‌ ఆస్పత్రిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసి భవనానికి నర్సింగ్‌ కళాశాల అని బోర్డు కూడా పెట్టారు. తీరా కళాశాల ప్రారంభోత్సవ సమయానికి ఆయూష్‌ విభాగం అధికారులు భవ నం అప్పగించలేమని చెప్పడంతో తాత్కాలికంగా వైద్య కళాశాలలో వర్చువల్‌ పద్ధతిన కళాశాలను ప్రారంభించగా 45మంది విద్యార్థులు ప్ర వేశాలు పొందారు. సరైన భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ భారమైంది. దీంతో ఆన్‌లైన్‌లో విద్యార్థులు తరగతులను వింటున్నా నెట్‌వర్క్‌ సమస్యతో పాటు, కొంతమంది విద్యార్థులకు సరైన ఫోన్‌లు అందుబాటులో లే కపోవడం సమస్యగా మారుతోంది. జూన్‌ మాసంలో మొదటి సెమిస్టర్‌ ఉండటంతో ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థుల భవిష్యత్‌ ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఆయూష్‌ ఆస్పత్రి భవనం అప్పగించి..

అంతలోనే రద్దుచేసి..

నిధులు మంజూరైనా స్థలం కరువు

అధ్యాపకుల కొరత

నర్సింగ్‌ కళాశాలకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా 60మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ మాత్రం 45మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించేలా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మొదటి సంవత్సరంలో 45మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కళాశాల తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సహా ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 16మంది అధ్యాపకులు ఉండాలి. కళాశాల నిర్వహణకు సంబంధించి ఒక ఏఓ, ఇద్దరు చొప్పున యూడీసీ, ఎల్డీసీ, ఒక ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉండాలి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో శానిటేషన్‌, క్లీనింగ్‌ చేసేందుకు మరొక 40మంది సిబ్బంది అవసరం. కానీ ప్రస్తుతం ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌తో పాటు జిల్లా జనరల్‌ ఆస్పత్రికి చెందిన ఐదుగురు నర్సింగ్‌ ఆపీసర్లు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

స్థల సేకరణ పూర్తయితే భవన నిర్మాణం..

కళాశాల నిర్మాణానికి స్థలం, తాత్కాలిక భవనం కేటాయించాలని కలెక్టర్‌ను పలుమార్లు కలిశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆన్‌లైన్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా నిత్యం నాలుగు తరగతులను నిర్వహిస్తున్నాం. కళాశాల భవనం, అధ్యాపకులు, సిబ్బంది నియామకంపై ఇప్పటికే అధికారులకు నివేదికలు అందించాం. తరగతుల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– ఉమామహేశ్వరి, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

ఆన్‌లైన్‌లోనే తరగతులు..1
1/1

ఆన్‌లైన్‌లోనే తరగతులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement