రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

Mar 6 2025 1:54 AM | Updated on Mar 6 2025 1:50 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో రైస్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించినట్లు జిల్లా రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాండ్ల తిరుపతి, యాంసాని సంతోష్‌లు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇతర జిల్లాలకు సీఎంఆర్‌ రైస్‌ను పంపలేమని, బీజీ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఇవ్వలేమన్నారు. స్పందించిన మంత్రి సీతక్క, సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం

భూపాలపల్లి రూరల్‌: నేడు (గురువారం) 11 కేవీ జంగేడు టౌన్‌లోని ఫీడర్‌పై చెట్ల కొమ్మలు తీయుట, మరమ్మతు పనుల దృష్యా జంగేడు, ఫకీర్‌గడ్డ, వేశాలపల్లి, భాస్కర్‌గడ్డ, డబుల్‌ బెడ్‌ రూం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని భూపాలపల్లి పట్టణ ఏఈ విశ్వాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని కోరారు.

మహిళలకు క్రీడాపోటీలు

భూపాలపల్లి అర్బన్‌: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం లేడీస్‌ క్లబ్‌ మహిళలకు క్రీడాపోటీలను నిర్వహించా రు. ఇల్లంద్‌ క్లబ్‌లో త్రో బాల్‌, బాంబ్‌ ఇన్‌ సి టీ, బాల్‌ పాసింగ్‌ నిర్వహించారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సేవా అధ్యక్షురా లు సునీతరాజేశ్వర్‌రెడ్డి, క్లబ్‌ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‌: హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వరంగల్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్‌ మొదటి వారంలోగా హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు ఓఎస్‌డీ హిమజాకుమార్‌ 90300 79242 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

మానేరులో

తాత్కాలిక రోడ్డు తొలగింపు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

టేకుమట్ల: మండలంలోని కలికోట శివారు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌ శివారు మానేరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. గతంలో మానేరులో నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డుకు కొంత సేవా రుసుం వసూలు చేస్తూ రవాణా సౌకర్యాన్ని కల్పించారు. కొంతమంది స్వలాభం కోసం టోల్‌ నిర్వాహకులను నగదును డిమాండ్‌ చేయడం, టోల్‌ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ప్రచారం చేసి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ నెల 1న పోలీసుల సమక్షంలో టోల్‌ ఎత్తివేశారు. అప్పటి నుంచి రాకపోకలు ఉచితంగా వినియోగించుకున్నారు. తాజాగా రోడ్డును తొలగించడంతో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, భూపాలపల్లి నుంచి పెద్దపల్లి, మంచిర్యాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానేరులో తాత్కాలిక రోడ్డు ప్రతీఒక్కరికి అవసరమని, రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement