
వినతిపత్రం ఇస్తున్న యూనియన్ నాయకులు
భూపాలపల్లి రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సరోజన కోరారు. సోమవారం డీడబ్ల్యూఓ జిల్లా ఇన్‌చార్జ్ అధికారిణి శైలజను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను పరిష్కరించాలంటూ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సరోజన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలు, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతులతో పాటు బదిలీలు అమలు చేయాలని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో యూనియన్ బాధ్యులు చంద్రకళ, వసంత, కోమలాదేవి, ప్రియాంక, త్రివేణి, సుజాత, హిమబిందు, రజిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.