
భూపాలపల్లి రూరల్: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీఆర్‌డీఓ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన 40అర్జీలను డీఆర్‌డీఓ స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు విన్నారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడానికి అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
కోటంచ హుండీ ఆదాయం రూ.17,98,282
టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల వారం రోజుల పాటు కొనసాగిన బ్రహ్మోత్సవాల అనంతరం సోమవారం ఆలయ హుండీని ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్, చైర్మన్ మాదాడి అనితాకరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ.17,98,282 రాగా మిశ్రమ బంగారం 35 గ్రాములు, మిశ్రమ వెండి 2.600గ్రాములు, తమలపాకు తోరణం పూసలతో 0.370 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, ధర్మకర్తలు మంగ, విజయ పోగు సుమన్, కుమారస్వామి, లింగయ్య, రాజేశ్వర్‌రావు, శంకర్, నరేష్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ రవీందర్‌రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆల్ ఇండియా యూనివర్సిటీ బాక్సింగ్ పోటీలకు
క్రాంతికుమార్
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల విద్యార్థి సంకటి క్రాంతికుమార్ ఆల్ ఇండియా యూనివర్సిటీ బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల హనుమకొండ జేఎన్‌ఎస్ స్టేడియంలో జరిగిన అంతర్ కళాశాలల బాక్సింగ్ పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచినట్లు చెప్పా రు. ఏప్రిల్ 4నుంచి 11వరకు కేఐఐటీ యూనివర్సిటీ ఒడిశా రాష్ట్రంలో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ను సీనియర్ క్రీడాకారులు ప్రభు చరణ్, ఫిట్ ఇండియా అధ్యక్షుడు రవి, క్రీడాకారులు వినోద్, సాయికృష్ణ అభినందించారు.
సమష్టికృషితోనే
భవన నిర్మాణం
భూపాలపల్లి రూరల్: సమష్టి కృషితోనే మూన్నూరుకాపు సంఘం భవనం నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పెండెల సంపత్ అన్నారు. సోమవారం కారల్‌మార్క్స్ కాలనీలో మూన్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి సంపత్ దంపతులతోపాటు మున్సిపల్ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు దంపతులు హాజరై పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్‌చైర్మన్ హరిబాబు మాట్లాడారు. నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, నాయకులు లట్ట రాజబాపు దంపతులు, ఉస్కె ఒదెలు, గండు రమేష్, నరిగద్ది వెంకటనారాయణ దంపతులు, మున్నూరు కాపుసంఘం అధ్యక్షుడు బస్కార్ల సత్యనారాయణ, చతుర్రూప అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షుడు బండారి రమేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.