పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన | - | Sakshi
Sakshi News home page

Feb 26 2023 10:06 AM | Updated on Feb 26 2023 10:06 AM

ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర  - Sakshi

ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసీంపల్లి గ్రామంలో గ్రామ ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మతల్లి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్‌ ప్రహరీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దమ్మతల్లి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్తహరిబాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్దు, గండి శ్రీనివాస్‌, మేనం రాజేందర్‌, తాటి అశోక్‌, మోకిడి అశోక్‌, బేతు రమేష్‌, జనగాం శ్రీనివాస్‌, ప్రతాప్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్‌, ముదిరాజ్‌ పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు తూటి దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement