ఆట వస్తువులు అందజేత | - | Sakshi
Sakshi News home page

Feb 26 2023 10:06 AM | Updated on Feb 26 2023 10:06 AM

- - Sakshi

పలిమెల: శ్రేయోభిలాశి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పంకెనలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆట వస్తువులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. చదువుతో పాటు, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శరీర ధారుడ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేష్‌, శ్రేయోభిలాశి సేవా ట్రస్టు చైర్మన్‌ రామకృష్ణ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జవ్వాది తిరుపతి, పాఠశాల ప్రిన్సిపాల్‌ కనకలక్ష్మి, బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌రావు, ప్రకాశ్‌, మనోహర్‌, సత్యనారాయణ, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలి
ములుగు రూరల్‌: సమస్యల పరిష్కారానికి బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డెపల్లి రఘుపతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్‌లో నిరుపేదలు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 5,700 మంది దరఖాస్తులు చేసుకొని రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌లను 34శాతం నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. బీసీలకు రాజకీయాల్లో 58 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈబీఎస్‌ నిధుల కోటను పెంచాలన్నారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన కన్వీనర్‌గా బట్టు మురళీకృష్ణను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య నియమించగా నియామక పత్రాన్ని రఘుపతి అందజేసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య, జాతీయ కన్వీనర్‌ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోల జనార్ధన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement