కొడకండ్ల: మండల కేంద్రంలో మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చేనేత కార్మికుల సంక్షేమానికి బాసటగా నిలువాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మినీ టెక్స్‌టైల్ పార్క్ అంశంపై మాట్లాడారు.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పరిపాలన అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేశారన్నారు. నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది చేనేత కార్మికులు ఉపాధి కోసం సూరత్‌కు వెళ్తారని, కొడకండ్ల, దేవరుప్పులలో ఎంతో మంది పద్మశాలీలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని మినీ టెక్స్‌టైల్ పార్క్‌తో స్థానికంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకుగాను మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇచ్చి రూ.63 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


