కారు దోబార్!
మండలాల వారీగా ఫలితాలు..(ఏకగ్రీవాలు కలిపి)
జనగామ: జిల్లాలో రెండో విడత జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర మలుపులు తిరిగాయి. తొలి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయగా, మలి విడతలో మాత్రం బీఆర్‌ఎస్ గులాబీ దళం తన సత్తాను చాటుకుని తిరిగి ఆధిపత్యం సాధించింది. నాలుగు మండలాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో సగం సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుని బీఆర్‌ఎస్ మరోసారి జనగామ తన కంచుకోటేనని నిరూపించింది. రెండో విడతలో బీఆర్‌ఎస్ విజయానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సుడిగాలి పర్యటన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఊరూరా తిరుగుతూ చేసిన ప్రచారం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం గులాబీ దళానికి కలిసివచ్చింది. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, రాష్ట్ర యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్త్రత ప్రచారం కొంతమేర ఫలితాలు ఇచ్చినప్పటికీ, అంతర్గత అసంతృప్తి, రెబ ల్స్ ప్రభావం పార్టీని నష్టపరిచినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్ 38 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ 26 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. కానీ కొన్ని గ్రామాల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోవడం ఆ పార్టీకి నిరాశ కలిగించింది.
స్వతంత్రుల సత్తా
రెండో విడత ఎన్నికల్లో అసలైన హైలైట్ మాత్రం స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. మొత్తం 13 మందిలో నలుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో 8 మంది స్వతంత్రులు అధికార–ప్రతిపక్ష పార్టీలకు గట్టి సవాల్ విసిరి విజయదుందుభి మోగించారు. గెలిచిన స్వతంత్రుల్లో ఇద్దరు బీఆర్‌ఎస్ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ ఉండటం రాజకీయంగా కీలకంగా మారింది. పార్టీల కంటే వ్యక్తిగత పలుకుబడి, స్థానిక సమస్యలే ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేశాయనే విషయం ఈ ఫలితాలతో స్పష్టమైంది.
రెండు చోట్ల బీజేపీ బోణీ..
బీజేపీ కూడా ఈసారి తన బోణి చేసింది. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో రెండు చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకుని నియోజకవర్గం కమల దళానికి గుండెకాయలాంటిదని నిరూపించింది.
నరాలు తెగే ఉత్కంఠ..
నాలుగు మండలాల్లో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదట వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి, అనంతరం సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను కౌంట్ చేశారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి, పోచన్నపేట, గోపాల్‌నగర్, జనగామ మండలం వడ్లకొండ, పెంబర్తి తదితర గ్రామాల్లో ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. కొన్నిచోట్ల రీకౌంటింగ్ నిర్వహించగా, తమ్మడపల్లిలో ఓటమిని నిరసిస్తూ ధర్నాలు కూడా చోటు చేసుకున్నాయి.
ఎస్కార్టు మధ్య బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు
జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ మండల పరిషత్ కార్యాలయాలు, అక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని సోషల్ వెవెల్ఫేర్ గురుకులంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించారు. పీఓ, ఓపీఓలు బ్యాలెట్ బాక్స్‌లను అక్కడ అప్పగించారు.
73 సర్పంచ్...555 వార్డులు
జిల్లాలో 79 జీపీలు, 710 వార్డుల్లో ఆరు చోట్ల సర్పంచ్, 155 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 73 సర్పంచ్, 555 వార్డుల్లో పోటీ జరిగింది. హోరాహోరీ జరిగిన సమరంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
ఆర్వో అన్యాయం
చేశారంటూ ధర్నా
బచ్చన్నపేట: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల్లో ఆర్వో అన్యాయం చేశారంటూ సర్పంచ్ అభ్యర్థి ఎలుగల శ్రీనివాస్‌రెడ్డితో పలువురు గ్రామస్తులు కలిసి జనగామ–బచ్చన్నపేట రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్వో మరో ప్రత్యర్థి అభ్యర్థి బేజాడి సిద్దులుకు అండగా నిలిచి ఆయన గెలిచినట్లు ప్రకటించారని దీనిపై సంబంధిత ఎన్నికల అధికారులు విచారణ జరపాలని పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గ్రామ ఎన్నికల ఫలితాలపై మూడుసార్లు రీకౌంటింగ్ చేసినా బేజాడి సిద్దులుకు 4 ఓట్లు ఎక్కువగా వచ్చాయని ఆ ఫలితాలనే ప్రకటించారని సర్పంచ్‌గా బేజాడి సిద్దులును ప్రకటించారని వారు డిమాండ్ చేశారు.
పట్టుపట్టి..మూడోసారికి
పదవి పట్టి!
బచ్చన్నపేట: మండలంలోని బండనాగారం గ్రామ సర్పంచ్ ఇజ్జగిరి రాములు మూడుసార్లు సర్పంచ్‌గా పోటీచేయగా మూడో సారికి గెలుపొందారు. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోగా పట్టుదల వదలని విక్రమార్కుడిలా మళ్లీ మళ్లీ పోటీ చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి సమీప అభ్యర్థి ప్రభాకర్‌పై 345 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు.
మరిన్ని ఎన్నికల వార్తలు 8లో
సర్పంచ్‌లు వీరే.. 9లో
నాలుగు మండలాల్లో 38 స్థానాలు
కై వసం
కాంగ్రెస్ 26, బీజేపీ 2 స్థానాల్లో గెలుపు
సత్తాచాటిన స్వతంత్రులు
రెబల్స్ ప్రభావం..కాంగ్రెస్,
బీఆర్‌ఎస్‌లకు నష్టం
మండలం జీపీలు బీఆర్‌ఎస్ కాంగ్రెస్ బీజేపీ స్వతంత్రులు
జనగామ 21 10 05 01 05
తరిగొప్పుల 15 05 08 – 02
నర్మెట 17 08 05 – 04
బచ్చన్నపేట 26 15 08 01 02
మొత్తం 79 38 26 02 13
కారు దోబార్!
కారు దోబార్!
కారు దోబార్!
కారు దోబార్!


