తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ
జనగామ రూరల్: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్‌షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, సీఈఓ జడ్పీ మాధురి షా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన
చిల్పూరు: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మాధవీలత, ఎంపీడీఓ శంకర్‌నాయక్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీఓ మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని రాజవరం గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్, డీఈఓ పింకేష్‌కుమార్ సందర్శించారు. ఆయన వెంట జీసీడీఓ గౌసియా, డీఈ రవీందర్, ఏఈ వెంకటనర్సు, ఎస్‌వో ప్రశాంతి ఉన్నారు.
రాజీమార్గంతోనే
సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: రాజీమార్గంతోనే కక్షిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఈనెల 21న జరుగనున్న జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..సమయం వృథా కాకుండా సామరస్యంగా ఇరుపక్షాలను ఒప్పించి రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసును, కుటుంబ తగాదా కేసులను సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ జెడ్జి సుచరిత, జి.శశి, కె. సందీప, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండబోయిన హరిప్రసాద్ యాదవ్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
పడమటితండా (డి) సర్పంచ్, ఐదుగురు వార్డుమెంబర్లు ఏకగ్రీవం
దేవరుప్పుల: మండలంలోని ధర్మాపురం రెవెన్యూ పరిధి పడమటి తండా (డి) గ్రామపంచాయతీ సర్పంచ్‌తో సహా ఐదుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన జాటోతు నవీన్‌నాయక్ ప్రత్యర్థి జాటోతు మురళి చివరిరోజు ఉపసంహరించుకోగా ఎనిమిది వార్డులకుగానూ ఐదుగురు దస్రూ, పూలమ్మ, తారమ్మ, సునిత, సుజాత ఏకగ్రీవం అయ్యారు.
ముగిసిన మూడో విడత విత్‌డ్రాలు
దేవరుప్పుల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం పలువురు సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలకుగానూ పడమటితండా(డీ) ఏకగ్రీవం కాగా మిగతా 31 గ్రామాల్లో సర్పంచ్ గిరి కోసం 91 మంది, 274 వార్డులకుగానూ 45 ఏకగ్రీవం కాగా మిగిలిన 229 వార్డులకు 656 మంది పోటీలో ఉన్నారు.
తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ
తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ
తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ


