సర్వం సిద్ధం
● నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ
● బరిలో 341 మంది
సర్పంచ్ అభ్యర్థులు..
● 1,854 మంది వార్డు సభ్యులు
జనగామ: జిల్లాలో మొదటి విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆద్వర్యంలో ఈనెల 10న (బుధవారం) ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
మొదటి విడత పోలింగ్ ఎక్కడంటే..
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాలఘణపురం మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ 100 జీపీలు, 1,024 వార్డులకు గాను 10 మంది సర్పంచ్, 228 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. 12 జీపీల్లో 341 సర్పంచ్, 1,854 వార్డుల్లో (784 మంది బరిలో) ఎలక్షన్లు జరుగనున్నాయి. ఐదు మండలాల పరిధిలో పురుషులు 85,180, మహిళలు 87,322, అదర్స్ 4 కలుపుకుని మొత్తంగా 1,72,506 ఓట్లు ఉన్నాయి.
ఐదు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు...72 బస్సులు
ఈ నెల11న జరగనున్న పోలింగ్ కోసం బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 1,024 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పీవో 1,131, ఓపీఓ 1,544 మంది విధులు నిర్వర్తించనున్నా రు. పోలింగ్ సామాగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు 72 బస్సులను సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 42 జోన్లుగా విభ జించి, 112 రూట్లను గుర్తించారు. సామగ్రి తీసుకునే సమయంలో సంబంధిత బాధ్యులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు ఉదయం 8.30 గంటల వరకే చేరుకోవాల్సి ఉంటుంది. స్టేజ్–2 ఆర్వోల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ జరుగుతుంది.
బ్యాలెట్ పంపిణీ పక్కాగా జరగాలి..
పోలింగ్ సిబ్బంది చెక్‌లిస్టు ప్రకారం మెటీరియల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వానే బయలుదేరాలి. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్య రాకుండా శిక్షణ కేంద్రం సైతం ఏర్పాటు చేయాలి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్లకు తగ్గట్టుగా బ్యాలెట్ పేపర్ పంపిణీ పక్కాగా జరగాలి.
– రిజ్వాన్ బాషా షేక్, ఎన్నికల అధికారి, కలెక్టర్
సర్వం సిద్ధం


