అప్రమత్తంగా ఉండాలి
● ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్
జనగామ: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీంల పాత్ర కీలకమని, అప్రమత్తంగా ఉండాలని ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, తదితర అంశాలపై తహసీల్దార్‌లతో మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫెరెన్స్ హాల్ నుంచి వారు సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ సమయంలో నగదు, మద్యం తదితర వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా, పోలింగ్ ముగిసేవరకు అధికా రుల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
రేపు స్థానిక సెలవు
జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మొదటి విడత 11వ తేదీ, రెండో విడత 14, మూడో విడత 17వ తేదీన స్థానికంగా సెలవులు ఉంటాయన్నారు. ప్రకటించడం సమీక్షలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ విక్రమ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.


