ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడలు
జనగామ రూరల్: మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ధర్మకంచ, మినీ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె. కోదండరాములు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వివిధ మండలాల నుంచి దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 18ఏళ్లలోపు బాలబాలికలకు అలాగే మహిళలకు, పురుషులకు క్యారమ్, చెస్, జావెలిన్ త్రో, 100 మీటర్ల రన్నింగ్, షార్ట్ పుట్ ఈవెంట్లలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ మెప్మా హర్షవర్ధన్, డీపీఎం జ్యోతి తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, దివ్యాంగుల జిల్లా కమిటీ సభ్యులు పంతులు ప్రభాకర్, మట్టి కిషన్, తాళ్లపల్లి కుమార్, దామెర రమేశ్, సయ్యద్ మున్నావర్, గడ్డం సోమరాజు, సీనియర్ అసిస్టెంట్ సంపత్ కుమార్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ చింతకింది రాజు, దివ్యాంగులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని భవిత కేంద్రంలో విద్యాశాఖ అధ్యంలో సాంస్కృతి క కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ నుంచి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.


