న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పంచాయతీ
12
మండలాలు
జిల్లాలో
జీపీలు
ప్రశాంత
గ్రామాలు
103
సమస్మాత్మక
గ్రామాలు
జనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం విస్త్రత భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. వరంగల్–హైదరాబాద్ ప్రధాన హైవేలోని బచ్చన్నపేట(పోలీసు శాఖ), పెంబర్తి జంక్షన్(ఎలక్షన్ కమిషన్) ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలుండగా, వీటిలో 177 గ్రామాలు సాధారణంగా పరిగణలోకి తీసుకుంటుండగా, 103 గ్రామాలను సమస్యాత్మక జీపీలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు, రిజర్వ్ ఫోర్సు బలగాలు, నిఘా టీంలు నిత్యం నిఘా వేస్తున్నాయి.
చెక్‌పోస్టులు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ
ఎన్నికల పారదర్శకతను కాపాడడంలో భాగంగా వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, స్వతంత్ర అబ్జర్వర్ల పర్యవేక్షణ అమలు కాబోతోంది. గ్రామాల్లో అల్లర్లకు తావివ్వకుండా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామపెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సున్నితమైన గ్రామాల్లో పోలీసు పహారా, రాత్రి పెట్రోలింగ్ తనిఖీలను మరింత బలోపేతం చేశా రు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో లైసెన్సు కలిగిన వ్యక్తుల వద్ద ఉన్న తుపాకులను ముందస్తు చర్యగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత క్రిమినల్ కేసులు ఉన్నవారు, గుడుంబా తయారీ, రవాణాలో నిమగ్నమైన వారు, బెల్ట్‌షాపుల నిర్వాహకులు, కాంప్లికేటెడ్ హిస్టరీ రౌడీషీటర్లు వంటి 120 మందిని తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు, యంత్రాంగానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా నడుచుకోవాలని పోలీసు శాఖ వారికి కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
మూడు విడతల్లో..
జిల్లా వ్యాప్తంగా స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ విడతకు ప్రత్యేక భద్రతా బలగాల కేటాయింపు, సెక్టార్ మొబైల్ పార్టీలు, రూట్ మ్యాపులు సిద్ధం చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నాయకత్వంలో, డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు, పోలీసు, జిల్లా ఉన్నతాధికారులు, కలిసి ఎన్నికల రోజు నాటికి ఏ చిన్న ఉద్రిక్తత రాకుండా ముందస్తుగానే శాంతిభద్రతలపై దృష్టి పెడుతున్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో చేపట్టిన చర్యలన్నీ గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పి, ప్రజాస్వామ్య ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బచ్చన్నపేట, పెంబర్తి చెక్‌పోస్టుల పరిధిలో రాత్రింబవళ్లు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద రవాణాపై కఠిన పర్యవేక్షణ అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ చలామణి, డబ్బు, మద్యం తరలింపు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయి మానిటరింగ్ టీం వ్యవస్థల ద్వారా పోలింగ్ కేంద్రాలన్నింటినీ సరైన సమయంలో అధికారులు పరిశీలించనున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండనుంది. ప్రతీ విడత పోలింగ్‌కు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. సెక్టార్ అధికారులకు బాధ్యతలు అ ప్పగించగా, పోలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాపులు సిద్ధం చేశారు. గుర్తించిన సున్నిత కేంద్రాల్లో అదనపు భద్రతా సిబ్బందిని కేటాయించారు.
పర్యవేక్షణ చేస్తున్నాం..
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు యంత్రాంగం అలెర్టుగా ఉంది. ప్రతీ రోజు నామినేషన్ల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం. ఎన్నికల రోజున ఏ చిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం యంత్రాంగం ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశాం. 103 సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించగా, 120 మందిని బైండోవర్ చేశాం. అలాగే లైసెన్స్ కలిగిన గన్స్‌ను డిపాజిట్ చేసుకున్నాం.
– రాజమహేంద్ర నాయక్, డీసీపీ, వెస్ట్‌జోన్
ఎన్నికల వేళ పోలీస్ శాఖ అప్రమత్తం
చెక్‌పోస్టులు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ
103 గ్రామాల్లో ప్రత్యేక నిఘా
120 మంది బైండోవర్...
గన్స్ డిపాజిట్
మూడు విడతల్లో ఎలక్షన్లు..
యంత్రాంగం సర్వం సిద్ధం
120
పకడ్బందీగా
పకడ్బందీగా
పకడ్బందీగా
పకడ్బందీగా
పకడ్బందీగా
పకడ్బందీగా
పకడ్బందీగా


