నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకుగానూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం వడ్లకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న రెండో విడత నామినేషన్ ప్రక్రియను అలాగే హెల్త్ డెస్క్‌లో అధికారుల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులను నిర్వహిస్తున్న అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ పత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.మహేశ్, ఎంపీఓ సంపత్‌కుమార్, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపక కార్యక్రమానికి జిల్లా ఎంపిక
వలసలను నిరోధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జిల్లా ఎంపికై ందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం తెలిపారు. రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ సెక్రటరీకి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థితిగతులను వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచి మహిళలను, యువతను, రైతులను మరింత సంపన్నులుగా, స్థితిస్థాపకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపిక అయిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
సిబ్బంది సహాయం తీసుకోండి..
నర్మెట: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో అదనపు సిబ్బంది సహాయంతో సకాలంలో స్వీకరణ కార్యక్రమం ముగించాలని కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా అన్నారు. మండల కేంద్రంతో పాటు మచ్చుపహాడ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, తహసీల్దార్ మొహసిన్, డీపీఆర్‌ఓ బండి పల్లవి, నర్మెట సీఐ ముసుకు అబ్బయ్య, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సై నైనాల నగేష్, ఏఎస్సై వెంకట్‌రెడ్డి, ఎంపీఓ వెంకట్ మల్లికార్జున్ ఉన్నారు.
నామినేషన్ ప్రక్రియ పరిశీలన..
తరిగొప్పుల: మండలంలోని పోతారం గ్రామంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య, తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, ఎంపీఓ కృష్ణకుమారి పాల్గొన్నారు.


