వేసవిలో లోడ్‌కు సరిపడేలా చర్యలు
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
జనగామ రూరల్: రాబోయే వేసవిలో లోడ్‌కు సరిపడేలా 100 నుంచి 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్లకొండ 220, 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సందర్శించారు. ఈందర్భంగా విద్యుత్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా అవసరమైన ఫీడర్ల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. నూతనంగా నిర్మించే ఎస్‌ఈ కార్యాలయాన్ని కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. అధునాతనంగా తీర్చిదిద్దాలని, పచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం 33/11 కేవీ పెంబర్తి గేట్‌వే సబ్ స్టేషన్‌న్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జనగామ ఎస్‌ఈ సీహెచ్.సంపత్ రెడ్డి, డీఈలు లక్ష్మినారాయణ రెడ్డి, గణేష్, విజయ్‌కుమార్ , సారయ్య, ఏడీఈ స్వామి రెడ్డి, ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు , ఎస్‌ఏ సుదర్శన్ పాల్గొన్నారు.


