రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు శివునిపల్లి విద్యార్థి
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన విద్యార్థి ఆజ్మీరా జగన్ రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కె.రమేశ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికై న విద్యార్థిని మంగళవారం హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సైన్స్‌ఫెయిర్‌లో సైన్స్ గైడ్ టీచర్లు ఎం.యాదగిరి, టి.శ్రీనాధ్ పర్యవేక్షణలో విద్యార్ధి ఆజ్మీరా జగన్ ఆటోమేటిక్ కారు పార్కింగ్ ఎగ్జిబిట్‌తో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం కె.ప్రవీన్‌కుమార్, ఉపాధ్యాయులు శ్రీనికాంత్, లక్ష్మీప్రసాద్, వసంతకుమారి, కృష్ణవేణి, ఫకీర్‌దాస్, రవి తదితరులు పాల్గొన్నారు.


