రెండో రోజు అదే జోరు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు అదే జోరు

Dec 2 2025 7:38 AM | Updated on Dec 2 2025 7:38 AM

రెండో

రెండో రోజు అదే జోరు

జనగామ: జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల పరిధిలో సోమవారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. నేటి (మంగళవారం)తో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. నాలుగు మండలాల పరిధిలో 19 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. రెండవ రోజు సర్పంచ్‌ అభ్యర్థులకు 157, వార్డు సభ్యులకు 396 నామినేషన్లు రాగా, రెండు రోజులకు కలుపుకుని సర్పంచ్‌ కోసం 214, వార్డులకు 464 వచ్చాయి. ఆయా మండలాల పరిధిలో నామినేషన్‌ సెంటర్లను కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, ఎలక్షన్‌ జనరల్‌ అబ్జర్వర్‌ రవి కిరణ్‌, డీసీపీ రాజమహేంద్రనాయక్‌ సందర్శించారు. ఇదిలా ఉండగా మొదటి విడతకు సంబంధించి స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండ 6వ వార్డుపై ఒక అప్పీల్‌ కాగా, అధికారులు పరిశీలన చేస్తున్నారు. రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌ అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిపై అప్పీల్‌కు వెళ్లారు.

రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు షురూ..

ఈ నెల 3వ తేదీ (బుధవారం) నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎలక్షన్ల నామినేషన్లు షురూ కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. నియోజకవర్గ పరిధిలో 91 జీపీలు, 800 వార్డుల పరిధిలో నామినేషన్ల స్వీరకరణకు 25 క్లస్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

జనగామ నియోజకవర్గంలో రెండవ రోజు నామినేషన్లు

అర్ధరాత్రి వరకు కొనసాగిన

రెండో విడత నామినేషన్ల పర్వం

రెండు రోజుల్లో సర్పంచ్‌ 214,

వార్డులకు 464 నామినేషన్లు

నేటితో ముగియనున్న

నామినేషన్ల స్వీకరణ

రేపటి నుంచి పాలకుర్తి

నియోజకవర్గంలో ప్రారంభం

మండలం జీపీ సర్పంచ్‌ మొత్తం వార్డులు నామినేషన్లు మొత్తం

జనగామ 21 39 51 198 106 119

నర్మెట 17 37 40 148 49 51

తరిగొప్పుల 15 32 40 126 86 104

బచ్చన్నపేట 26 49 83 238 155 190

మొత్తం 79 157 214 710 396 464

రెండో రోజు అదే జోరు 1
1/1

రెండో రోజు అదే జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement