హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలవాలి
జనగామ: భగవద్గీతను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతో పాటు విద్యాశాఖలో ప్రత్యేక సంస్కృత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక వేత్త, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం గ్రేయిన్ మార్కెట్ ఆవరణలోని లక్ష్మీనారాయణ దేవాలయంలో భగవత్ గీతా జయంతి, శౌర్య దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో భగవద్గీత పఠనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలవాలని, భగవద్గీత సకల వేదసారమన్నారు. భగవద్గీత ప్రతీ ఇంటిలో ఉండాలని, అలంకార ప్రాయం కాకుండా చదివి జీవితాన్ని సన్మార్గంలో నడవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి చిలువేరు హర్షవర్ధన్, కుందారపు బైరునాథ్, శివరామ్, సనత్, ఆలయ కమిటీ సభ్యులు మాడిశెట్టి రవి, వెంకన్న, కై లాసం, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


