కార్యకర్తలకు అండగా ఉంటాం..
● ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో బీఆర్‌ఎస్, సీపీఎం పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, మల్లారెడ్డి, రాఘవరావు, సోమేశ్వర్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, కుమారస్వామి, రమేష్, రాజశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


