నేటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
తరిగొప్పుల: రెండో విడత సర్పంచ్ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏసీపీ పండరి చేతన్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి ఉన్నారు.
ఆ ఊరి ఓట్ల కంటే
వార్డు ఓట్లే ఎక్కువ!
లింగాలఘణపురం: మండలంలోని ఏనెబావి గ్రామ పంచాయతీ ఓట్లు మండలంలోని ఓ పెద్ద గ్రామ పంచాయతీలోని ఒక్క వార్డు ఓట్ల కంటే తక్కువగానే ఉన్నాయి. ఏనెబావి గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన పిట్టలోనిగూడెం ఓట్లు కలుపుకొని మొత్తం 285 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 134 పురుషులు, 151 మహిళల ఓట్లు ఉండగా మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ అయిన నెల్లుట్లలో 4,885 ఓట్లు ఉండగా ఒక్క మూడో వార్డులో 356 ఓట్లు ఉన్నాయి. అంటే ఏనెబావి గ్రామ పంచాయతీలోని మొత్తం ఓట్లతో పోల్చి తే నెల్లుట్లలోని ఒక్క వార్డులో ఉన్న ఓట్లు కూడా లేవు. అందులో మరో విశేషం ఏమిటంటే ఒక్క బీసీ ఓటరు లేని 1,2,3 వార్డులు బీసీలకు రిజ ర్వేషన్ కావడం, ఒక్క ఎస్టీ ఓటరులేని 4,5,6 వార్డులు ఎస్టీకి రిజర్వేషన్ కావడం జరిగింది. ఇందులో 1,2,3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గతంలో సర్పంచ్ ఎస్టీ కావడంతో ఏకగ్రీవమైంది. ప్రస్తుతం బీసీ మహిళ కావడంతో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒకవేళ ఓటింగ్ జరిగితే 285 ఓట్లలో ఎక్కువ ఎవరికి వస్తే వారే సర్పంచ్‌గా గెలిచే అవకాశం ఉంది.
హేమాచలానికి
పోటెత్తిన భక్తులు
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి సందడి చేశారు.
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు


