ఇరుకు చౌరస్తాలో ట్రా‘ఫికర్’
నర్మెట చౌరస్తాలో ట్రాఫిక్ జాం
మండలకేంద్రంలోని చౌరస్తా ఎప్పుడూ బిజీబిజీ.. ఏక్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. జనగామ–హుస్నాబాద్–కరీంనగర్‌కు నిత్యం వందలాది వాహనాల రాకపోకలు..ఇరుకై న చౌరస్తా...నలువైపుల నుంచి వాహనాలు...అక్కడే బస్టాప్..మరొక వైపు ప్రయాణికులను చేరవేసే ఆటోలు, జీపులు.. వేగంగా వెళ్లే వాహనాలు.. ఇలా ఎప్పుడూ ప్రమాదభరితమే. దీనికితోడు చౌరస్తా నుంచే తిరిగి హన్మకొండ, హైదరాబాద్ (పికెట్) వెళ్లే బస్సులు. రోడ్డు పక్కనే ద్విచక్రవాహనాల పార్కింగ్‌లు. స్థలం ఇరుకుగా ఉండడం, పార్కింగ్‌కు అనువైన స్థలం లేకపోవడం, వాహనదారులు నిబంధనలు పాటించక పోవడంతో నర్మెట చౌరస్తా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
– నర్మెట


