అన్నదాతలకు ‘దిత్వా’ భయం
దిత్వా తుపాను కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రాగా కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. దాంతో రైతులు కల్లాల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులుగా పోసి తుపాను ఎఫెక్ట్‌తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, తీవ్రంగా చలి నెలకొనడంతో పాటు కారుమబ్బులు వస్తుండగా అన్నదాతలు గుబులు చెందుతున్నారు. దీంతో కల్లాల్లో, ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యంపై రైతులు ముందస్తు జాగ్రత్తగా పరదాలు కప్పుకుంటున్నారు.
– స్టేషన్‌ఘన్‌పూర్


