అంతా ఏకమయ్యారు..
● జిట్టెగూడెంతండా, రామన్నగూడెం
జీపీలు ఏకగ్రీవం
స్టేషన్‌ఘన్‌పూర్: రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలంతా ఏకమై సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవం చేసుకున్న సంఘటన స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండలాల్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లోకి వెళ్తే అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని గ్రామపెద్దల సహకారంతో ప్రజలంతా ఏకమయ్యారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డులను ఏకగ్రీవం చేసుకుంటూ తీర్మానం చేశారు. ఈ మేరకు నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో ఒక్కొక్కరినే నామినేషన్ వేయించారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం జిట్టెగూడెంతండా సర్పంచ్ స్థానానికి గాలిగుట్టతండాకు చెందిన బానోతు బాలు, ఉపసర్పంచ్‌గా నునావత్ రజితతో పాటు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే రఘునాథపల్లి మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వాకిటి అలివేలు, ఉపసర్పంచ్‌గా వెంపల్ల భాస్కర్‌తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చెకుముకి రాష్ట్రస్థాయి
పోటీలకు ఎంపిక
జనగామ రూరల్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ధర్మకంచ పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం కనకయ్య తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన సంయుక్త, మల్లికార్జున్, అక్షిత అనే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు గైడ్ టీచర్ చంద్రశేఖర్‌రావుతో పాటు విద్యార్థులను పాఠశాల చైర్మన్ యాస్మిన్, ఉపాధ్యాయులు అభినందించారు.
నామినేషన్ కేంద్రం పరిశీలన
చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని శనివారం డీసీపీ రాజమహేందర్‌నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోలనతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దన్నారు. ఆయన వెంట జనగామ రూరల్ సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.
హన్మకొండ: భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఇంచార్జ్‌ల పేర్లను శనివారం ప్రకటించారు. హనుమకొండ జిల్లాకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. వరంగల్‌కు కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం), జయశంకర్ భూపాలపల్లికి దశమంత రెడ్డి (జనగామ), మహబూబాబాద్‌కు డాక్టర్ జరుపులావత్ గోపి (నల్లగొండ), ములుగు జిల్లాకు డాక్టర్ కోరండ్ల నరేష్ (రంగారెడ్డి), జనగామ జిల్లాకు కట్ట సుధాకర్ రెడ్డి (నాగర్ కర్నూల్)ను ఇన్‌చార్జ్‌గా నియమించారు.
బచ్చన్నపేట: గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నా రు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు, సాదాబైనామా పత్రాలను పరిశీలించారు. కొడవటూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రికార్డులు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు పంపించిన ధాన్యానికి త్వరగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, వీఓఏలు గంగం వాణి, మహేశ్వరి, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి రూపాచైతన్య, తదితరులు పాల్గొన్నారు.
బాలు,
జిట్టెగూడెంతండా
అలివేలు,
రామన్నగూడెం
అంతా ఏకమయ్యారు..
అంతా ఏకమయ్యారు..
అంతా ఏకమయ్యారు..


