నూతన ఆవిష్కరణలవైపు అడుగులు
జనగామ రూరల్: విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని సాన్‌మారియా ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్, సైన్స్‌ఫెయిర్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలను వీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో పింకేష్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు బీజం వేయాలన్నారు. ఉత్తమ ప్రదర్శనలకు సర్టిఫికెట్, బహుమతులు అందించారు. కాగా సైన్స్‌ఫెయిర్ సబ్ థీమ్స్‌లో జూనియర్, సీనియర్ విభాగాల్లో మొదటి, రెండో బహుమతి, ఇన్‌స్పైర్‌లో 8 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్‌రావు, గౌసియా బేగం, సైన్స్ అధికారి ఉపేందర్, బాను, నాగరాజు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్‌కుమార్
ముగిసిన జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్,
ఇన్‌స్పైర్ మనక్


