సైన్స్‌ఫెయిర్‌లతో సృజనాత్మకత
● జిల్లా సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించిన
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
● మొదటి రోజు 2వేల మందికి పైగా విద్యార్థులు సందర్శన
జనగామ రూరల్: సైన్స్ ఫెయిర్‌ల నిర్వహణతో వి ద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని కలెక్ట ర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం పట్ట ణంలోని హైదరాబాద్ రోడ్డులోని సాన్‌మారియా ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, సైన్స్ ఫెయిర్‌ను అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి పింకేశ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా జ్యో తిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం సైన్స్ పుస్తకాలు చదవడమే కాకుండా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుని మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవా లన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న ఏఐ యాప్స్ ద్వారా ఎంతో సమాచారం లభ్యమవుతోందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోర్సు ఎంచుకొని జీవితంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్ 333, ఇన్‌స్పైర్ 77 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. కాగా ఆరు మండలాల నుంచి సు మారు 2వేలకు పైగా విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి, సైన్స్ అధికారి ఉపేందర్, ఏఎంఓ శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ జగన్‌మోహన్ రెడ్డి, ఎంఈఓ శంకర్‌రెడ్డి, ఏసీజీ రవికుమార్, నాగరాజు, శ్రీకాంత్‌రెడ్డి , చంద్రబాన్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, చిత్రంలో జిల్లా విద్యాధికారి పింకేశ్ కుమార్, సైన్స్‌ఫెయిర్‌ను తిలకిస్తున్న విద్యార్థులు
సైన్స్‌ఫెయిర్‌లతో సృజనాత్మకత


