ఎన్నికల ఖర్చుకు ముందస్
లింగాలఘణపురం: సర్పంచ్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. దీనికోసం అభ్యర్థులు ఎంతటి ఖర్చునైనా భరించాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి. పార్టీ మద్దతు వచ్చిన అనంతరం అభ్యర్థులు ఖర్చు పెట్టేందుకు వెనుకాముందు ఆలోచిస్తారని, అభ్యర్థిని ఖరారు చేయడానికి ముందుగానే ఆయా గ్రామాల్లో అభ్యర్థుల నుంచి పార్టీ ముఖ్యనేతలు డిపాజిట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామంలోని ఓట్లు, అయ్యే ఖర్చు ముందుగానే లెక్కలు వేసి ప్రస్తుతానికి ఇంత మొత్తం డిపాజిట్ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. లేకపోతే మరో అభ్యర్థి ముందుకు వస్తాడని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థులు ముందస్తుగా డిపాజిట్లు చేస్తున్నారు.
బచ్చన్నపేట: మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో అధికంగా బీసీ జనాభానే ఉన్నారు. 50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీగా ఏర్పడగా గ్రామంలో ఒక్కరు కూడా ఓసీ లేరు. అయితే తాజా గ్రామ ఓటరు లిస్టులో ఓసీ వర్గానికి తాతిరెడ్డి ప్రేమలతారెడ్డి భర్త నారాయణరెడ్డి అనే పేరు వచ్చింది. ఆమెది తమ గ్రామం కాదని స్థానికులు చెబుతున్నారు. అలాగే పలువురు పేర్లు కూతాడి అనిత, నరేష్, దశరథ, కనుకమ్మ, అమ్రాజు భానుచందర్, పచ్చిమడ్ల ఎల్లమ్మ, పెద్దపాటి అనిత అనే పేర్లు కూడా గ్రామంలో లేకున్నా ఓటరు లిస్టులో వచ్చాయన్నారు. ఈ విషయమై ఎంపీడీఓ మమతాబాయ్ వివరణ కోరగా గ్రామంలో లేని వారు పేర్లు రావడంపై బీఎల్‌ఓలను అడుగాలన్నారు. ఆన్‌లైన్‌లో ఓటరు ఎక్కడనైనా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దానిపై తహసీల్దార్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. గ్రామంలో లేని వారి పేర్లను తొలగించాలని నివేదిక పంపామని పంచాయతీ కార్యదర్శి మధు తెలిపారు.
జనగామ: శ్రీ కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఉత్సవ కమిటీలో వెనకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించినట్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డితో కలిసి శివరాజ్ యాదవ్ మాట్లాడారు.. బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం నియమించిన ఉత్సవ కమిటీలో ఇద్దరు ఓసీ, మరో ఇద్దరు ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఉండగా, ఎనిమిది మంది బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గొల్లకురుమలకు ఐదు మందికి అవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని విమర్శించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.
జనగామ రూరల్: కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో బీసీ కులాలపై జరుగుతున్న అన్యాయాన్ని తప్పుపడుతూ ఈనెల 30న దేవస్థానం ఈఓ కార్యాలయం ముట్టడి చేయనున్నట్లు కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఆలయ కమిటీ చైర్మన్ పదవి గొల్ల,కురుమలకు ఇవ్వాల్సిన చోట, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం ఎండోమెంట్ శాఖ అధికారుల దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. ఈనేపథ్యంలో గొల్ల, కురుమ సంఘాలు సహా బీసీ సబ్బండ ఉపకులాల నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


